ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 11:20:18

ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించిన మంత్రులు

ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించిన మంత్రులు

వరంగల్ రూరల్ : భారతరత్న ప్రణబ్ ముఖర్జీకి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్  ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మహోన్నత వ్యక్తి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ నిన్న గుండెపోటుతో సైనిక హాస్పిటల్ లో మరణించారు. నేడు మహబూబాబాద్, తొర్రూర్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రులు నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కమిటీకి నాయకత్వం వహించి, రాష్ట్ర సాధన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మార్గనిర్దేశనం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిందని, వీటిని అందరూ పాటించాలని కోరారు.logo