బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 01:23:06

రైతులకు మరింత మంచికాలం

రైతులకు మరింత మంచికాలం

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 
  • మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్‌ జిల్లాలో
  • రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: స్వరాష్ట్రంలో తెలంగాణ రైతుల కష్టాలన్నీ తీరాయని, వారికి మరిన్ని మంచిరోజులు వస్తాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్‌ జిల్లా కీసర మండల పరిధిలోని యాద్గార్‌పల్లి, కీసర గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మంత్రులు కీసరలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బెస్త వెంకటేశ్‌, జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


logo