శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 14:29:25

దీక్షిత్ రెడ్డి మృతిపై మంత్రుల సంతాపం

దీక్షిత్ రెడ్డి మృతిపై మంత్రుల సంతాపం

హైదరాబాద్‌ :మహబూబాబాద్ జిల్లాకు చెందిన టీ న్యూస్ రిపోర్టర్ రంజిత్ రెడ్డి కుమారుడు దీక్షిత్ రెడ్డి(9) ని కిడ్నాప్ చేసి, హత్య చేయడంపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని,  కిడ్నాప్ చేసి, హత్య చేసిన వారిని అత్యంత కఠినంగా శిక్షిస్తామన్నారు. కిడ్నాప్ నకు గురైన దీక్షిత్ రెడ్డి ని రక్షించేందుకు ప్రభుత్వం తరఫున పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారని, కానీ దురదృష్టవశాత్తు తెలిసిన వారి చేతిలోనే దీక్షిత్ రెడ్డి హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు.దీక్షిత్ రెడ్డి కిడ్నాప్‌పై డీజీపీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసినప్పటికీ బాలుడు దక్కకపోవడం తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు. బాలుడి తల్లిదండ్రులకి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తల్లిదండ్రులకు మనోధైర్యం కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు.