శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 17:07:52

వ‌ర‌ద బాధితుల‌కు మంత్రులు మ‌ల్లారెడ్డి, స‌బితా ఆర్థిక‌సాయం

వ‌ర‌ద బాధితుల‌కు మంత్రులు మ‌ల్లారెడ్డి, స‌బితా ఆర్థిక‌సాయం

హైద‌రాబాద్ : వ‌ర‌ద స‌హాయక చ‌ర్య‌ల నిమిత్తం మంత్రులు మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి బాధితుల‌కు ప్ర‌భుత్వ ఆర్థిక‌సాయాన్ని అంద‌జేశారు. న‌గ‌ర‌లోని కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఓల్డ్ బోయిన‌ప‌ల్లి డివిజ‌న్‌లో ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు నీట మునిగిన ఇండ్ల బాధితుల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రి మ‌ల్లారెడ్డి రూ. 10 వేల ఆర్థిక‌సాయాన్ని అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ న‌వీన్‌, ఎమ్మెల్సే కృష్ణారావు, కార్పొరేట‌ర్ న‌ర్సింహాయాద‌వ్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు. అదేవిధంగా బ‌డంగ్‌పేట మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మీర్‌పేట‌లోని వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రూ. 10 వేల న‌గ‌దు సహాయాన్ని అంద‌జేశారు.