శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 14:45:02

75 వేల డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు పంపిణీకి సిద్ధం : కేటీఆర్

75 వేల డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు పంపిణీకి సిద్ధం : కేటీఆర్

హైద‌రాబాద్ : మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌తో రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చేప‌ట్టాల్సిన ప‌నుల‌ను ఎమ్మెల్యేలు మంత్రికి వివ‌రించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో వైకుంఠ‌ధామాల‌ ఏర్పాటు, చెరువుల అభివృద్ధి, సుందరీక‌ర‌ణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌న్నారు. ఈ ఏడాది చివ‌రి నాటికి సుమారు 75 వేల డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు పంపిణీకి సిద్ధ‌మ‌వుతాయ‌ని ఎమ్మెల్యేల‌కు కేటీఆర్ తెలిపారు. అన్నింటికీ సానుకూలంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. 

లాక్‌డౌన్ స‌మ‌యాన్ని చ‌క్క‌గా వినియోగించుకుని జీహెచ్ఎంసీ రోడ్ల లేయింగ్, నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేశామ‌ని కేటీఆర్ తెలిపారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఎస్ఆర్‌డీపీలో భాగంగా నిర్మించిన ప‌లు ప‌నుల ద్వారా చాలాచోట్ల ట్రాఫిక్ క‌ష్టాలు త‌ప్పాయ‌న్నారు. ముఖ్యంగా ఎల్బీన‌గ‌ర్ చౌర‌స్తా వంటి ప‌లు చోట్ల మొత్తం రూపురేఖ‌లు మారిపోయాయి. అంత వేగంగా ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్ ప‌నులు పూర్త‌య్యాయి. ఫుట్‌పాత్‌లు, టాయిలెట్ల నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న శానిటేష‌న్ ప‌నులు, జ‌ల‌మండ‌లి సివ‌రేజ్ నిర్వ‌హ‌ణ‌పై మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్య‌క్తం చేశారు. 


logo