గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 10, 2020 , 14:49:19

కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించిన మంత్రులు

కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించిన మంత్రులు

సంగారెడ్డి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి  పరిశీలించారు. మంత్రులతో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. రూ.1360 కోట్లతో 15,660 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇక్కడ నిర్మించారు. నిర్మాణాలు పూర్తి కావడంతో త్వరలో పేదలకు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఇండ్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.


logo