సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 12:26:13

ఖమ్మంలో కరోనా వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

ఖమ్మంలో కరోనా వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

ఖమ్మం :  జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రం(TRUNAT)న్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఖమ్మంలోని మమత దవాఖనలో కొవిడ్  పరీక్షల నిర్ధారణ కేంద్రాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు వైరస్ నిర్ధారణ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
logo