శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 26, 2020 , 22:37:29

ఆబ్కారీశాఖపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం..

ఆబ్కారీశాఖపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం..

హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ఇవాళ ఆబ్కారి శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్ రావు, హరికిషన్, జేసీ -ఎస్ వై ఖురేషి, ఈఎస్ దత్తరాజ్ గౌడ్ తో పాటు టీఎస్ బీసీఎల్ ఉన్నతాధికారులు సంతోష్ రెడ్డి, కులకర్ణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టామన్నారు. నీరా పాలసీలో భాగంగా ఆబ్కారి శాఖ అధికారులు కేరళ, రాజమండ్రిలోని హార్టికల్చర్ యూనివర్సిటీలలో నీరా తయారీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీరా సేకరణ, నిల్వ, మార్కెటింగ్ లతో పాటు నీరా కేఫ్ ల ద్వారా నీరాను అందించడంపై చేసిన పరిశోధనల పురోగతిపై  మంత్రి ఆబ్కారి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్యంతో పాటు గీత వృత్తి దారుల ఆత్మగౌరవం కోసం ప్రవేశపెట్టిన  నీరాను త్వరలో ప్రజలకు అందించేందుకు ఆబ్కారి శాఖ ఉన్నతాధికారులు అవసరమైన ప్రణాళికలు వేగంగా సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. టీఎస్ బీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్లు డిపోల సామర్ధ్యాన్ని బట్టి అవసరమైన కొత్త డిపోల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆబ్కారి శాఖ అధికారులను ఆదేశించారు.


logo