బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 20:46:09

రేపు పటాన్‌చెరులో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డిల పర్యటన

రేపు పటాన్‌చెరులో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డిల పర్యటన

సంగారెడ్డి: మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డిలు  రేపు (శుక్రవారం) పటాన్‌చెరు పట్టణంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పటేల్‌గూడ, రామచంద్రాపురం జీహెచ్‌ఎంసీ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.44.03కోట్ల అభివృద్ధి పనులకోసం  జరుగుతున్న పర్యటన ఏర్పాట్లను  పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పర్యవేక్షించారు. 

మంత్రులు ఈ నెల 22న ఉదయం10.30 గంటలకు కానుకుంటలో బస్తీ దవాఖాన, అనంతరం బండ్లగూడలోని బస్తిదవాఖానాను ప్రారంభిస్తారు. సమీపంలోని విద్యుత్‌శాఖ కార్యాలయం ఆవరణలో రూ.21.69 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 132 కేవీ సబ్‌స్టేషన్‌కు ప్రారంభోత్సవం చేస్తారు. రూ.2.45 కోట్ల ఖర్చుతో పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్మించిన 30 దుకాణాలను ప్రారంభించనున్నారు. పట్టణంలోని అంబేద్కర్‌ కమ్యూనిటి హాల్‌లో బస్తీ దవాఖానను ప్రారంభించి, అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌ఫూర్‌ గ్రామంలో రూ. 19.80కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ని మంత్రులు ప్రారంభించనున్నారు. 
logo