శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 26, 2021 , 15:10:10

కనకరాజుకు మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి అభినందనలు

కనకరాజుకు మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి అభినందనలు

హైదరాబాద్‌ : పద్మశ్రీ పురస్కార గ్రహీత, గుస్సాడీ నృత్యకళాకారుడు కనకరాజుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా మంత్రి స్పందిస్తూ.. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకోవడం గర్వంగా ఉందన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆదివాసీల సాంప్రదాయ గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తూ తెలంగాణ ఖ్యాతిని చాటుతున్న కనకరాజుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.  

ఆదివాసీల ఆత్మగౌరవ పతాక కనకరాజు..

రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. కనకరాజు ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తూ గుస్సాడీ నృత్యానికి గుర్తింపు తేవడంతో పాటు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచారని కొనియాడారు. పద్మశ్రీ రావడం జాతీయస్థాయిలో ఆదివాసీలకు దక్కిన గౌరవం అన్నారు.

VIDEOS

logo