శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 11:19:04

కోవిడ్‌-19 నియంత్రణకు మంత్రుల సమీక్షా సమావేశం

కోవిడ్‌-19 నియంత్రణకు మంత్రుల సమీక్షా సమావేశం

హైదరాబాద్ : కొవిడ్‌-19 నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ సమన్వయ కమిటీ భేటీ అయింది. నగరంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో కొనసాగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మంత్రులు సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై అదేవిధంగా ప్రజల్లో అవగాహన పెంచడం సహా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులు చర్చిస్తున్నారు.


logo