శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 12:25:44

రైతు వేదికలకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్

రైతు వేదికలకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్

జనగామ : కొడకండ్ల, రామారంలో మంగళవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కష్ట కాలంలోనూ రైతుబంధు పథకం ద్వారా సాయం అందించిన ప్రభుత్వం ఒక్క తెలంగాణ మాత్రమే అని అన్నారు. రైతు వేదికలకు రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపనలు చేస్తున్నామన్నారు.

కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo