శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 12:13:31

వాసుదేవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

వాసుదేవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

హైదరాబాద్ : రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా వాసుదేవరెడ్డి రెండోసారి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, సీనియర్ సిటిజన్ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్, గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు దివ్యాంగులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు వాసుదేవరెడ్డి నాయకత్వంలో సజావుగా అందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, వికలాంగుల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 


logo