శుక్రవారం 29 మే 2020
Telangana - Jan 22, 2020 , 08:31:27

ఓటింగ్‌లో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు

ఓటింగ్‌లో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
  • కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్
  • ఓటేసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఓటేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మంత్రి జగదీష్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసివెళ్లి ఓటేశారు. అదేవిధంగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్‌.ఆర్‌.హైస్కూల్‌లో ఎమ్మెల్యే దివాకర్‌ రావు,  పరిగిలోని 14వ వార్డులో ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి, ఆర్మూర్‌లో ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా హాలియాలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


logo