సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 01:24:40

స్వతంత్రంగా వ్యవహరించాలి

స్వతంత్రంగా వ్యవహరించాలి
  • మహిళా ప్రజాప్రతినిధులకు మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్‌ సూచన

నారాయణపేటప్రతినిధి,నమస్తేతెలంగాణ: మహిళా ప్రజాప్రతినిధుల పరిపాలనా వ్యవహారాల్లో  వారి భర్తలు, కుటుంబసభ్యులు జోక్యం చేసుకోవద్దని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. సోమవారం నారాయణపేటలోని జీపీ శెట్టి ఫంక్షన్‌హాలు లో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో మంత్రులు ప్రసంగించారు. రాష్ర్టాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. అంతకుముందు ఎక్లాస్‌పూర్‌లో ఏకోపార్క్‌ నిర్మాణానికి, సింగారం వద్ద అటవీ శాఖ గృహ నిర్మాణ సముదాయానికి మం త్రులు శంకుస్థాపనచేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

logo