e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home తెలంగాణ పీవీ బిడ్డను గెలిపించండి

పీవీ బిడ్డను గెలిపించండి

మచ్చలేని పీవీ కుటుంబం నుంచి వచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించండి. విద్యా వ్యవస్థపై ఆమెకు అపార అనుభవం ఉండటంతోపాటు లక్షల మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది దేశానికి అందించారు. ఉద్యోగ, విద్యార్థుల సమస్యల పరిష్కారం ఆమెతో సాధ్యమవుతుంది. రాష్ర్టానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు,14 వేల కంపెనీలను తీసుకొచ్చి 14 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ప్రభుత్వరంగ సంస్థల మెడకు ఉరి బిగించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తున్నది. 

           – సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి

వాణీదేవిని గెలిపించుకుందాం

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలుపించుకోవాలి. అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించి ఓటును అభ్యర్థించాలి. విపక్షాలు ఓటు వేస్తే జరగబోయే నష్టాన్ని వివరంగా తెలియజేయాలి. 

– మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి

పెట్రో ధరలు పెంచుతున్నవాళ్లకు ఓటేయాలా?

నల్లగొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైంది. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వ్యవసాయం పండుగలా మారింది. కాళేశ్వరం జలాలు తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో చాయ్‌ అమ్మిన అని చెప్పుకునే మోదీ ఇప్పుడు ఏకంగా రైల్వేనే అమ్మేస్తున్నారు. పెట్రో ధరలు అమాంతం పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వర్గాలు, సంఘాలు పల్లాకే మద్దతు పలుకుతున్నాయి.

– ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి 

ఎమ్మెల్సీగా పల్లానే ఆశీర్వదించండి

నల్లగొండ- వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మరోమారు ఆశీర్వదించాలి. తెలంగాణ అభివృద్ధికి కావాల్సింది ప్రశ్నించే గొంతులు కాదు.. సమస్యలు పరిష్కరించే కేసీఆర్‌ లాంటి నాయకులు. అన్ని జిల్లాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేసే పల్లా రాజేశ్వర్‌రెడ్డికే మొదటి ప్రాధాన్య ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.

– సత్యవతి రాథోడ్‌, గిరిజన సంక్షేమశాఖ

పట్టభద్రులంతా టీఆర్‌ఎస్‌ వెంటే..

అన్ని రంగాల ప్రజలతోపాటు పట్టభద్రులంతా టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ తెలంగాణ ద్రోహ పార్టీలే. వాటివల్ల తెలంగాణకు ఏ ప్రయోజనమూ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో అసలు ప్రశ్నలకు తావు లేకుండానే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. మిగిలిన అరకొర పనులు సైతం ఆయన వల్లే పరిష్కారమవుతాయనే విశ్వాసం అందరిలో ఉన్నది. అందుకే ప్రజలంతా ఆయన నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని కొనియాడుతున్నారు.

-జగదీశ్‌రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి 

Advertisement
పీవీ బిడ్డను గెలిపించండి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement