బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 09:04:26

నేడు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష

నేడు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష

హైదరాబాద్ : కరోనా రక్కసి రాజధాని నగరంపై కోరలు చాస్తున్నది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. రాజధాని హైదరాబాద్ తోపాటు సరిహద్దు జిల్లాల్లో కరోనా పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు. అలాగే పెరుగుతున్న కేసులతో ప్రభుత్వ దవాఖానల్లో అందరికి వైద్యం అందించడం ఇబ్బందికరంగా ఉంటుంది. సమస్య తీవ్రతరం కాకముందే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రైవేట్ ల్యాబ్ ల్లో కరోనా పరీక్షల ఫీజులపై చర్చించే అవకాశం ఉంది.


logo