ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 22:54:03

నేడు జగిత్యాలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

నేడు జగిత్యాలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

జగిత్యాల : రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం  వరంగల్‌ రూరల్‌, జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ఆయన వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మాజీ జడ్పీటీసీ దివంగత భుక్యా విజయ్‌ విగహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాధవాపూర్‌ గ్రామానికి చేరుకొని 10గంటల 30నిమిషాలకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొంటారు.  అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు  ధర్మపురి మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో మాజీ మంత్రి దివంగత జవ్వాడి రత్నాకర్‌రావు దశదిన కర్మ కార్యక్రమానికి హాజరుకానున్నారు. logo