మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 13:17:13

యూట్యూబ్-ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించిన మంత్రి

యూట్యూబ్-ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించిన మంత్రి

మహబూబ్‌నగర్ : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన యూట్యూబ్-ఆన్‌లైన్ తరగతులను ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరావు, డీఈవో ఉషా రాణి, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.