శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 22, 2020 , 11:57:44

విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి

విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి

ఖమ్మం : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం పంపిణీ చేశారు. ఖమ్మం నగరంలోని ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేశారు. కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 


జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ మొత్తం కలిపి 1329 పాఠశాలలో చదువుకుంటున్న 1,07,266 మంది విద్యార్థులకు గాను 5.65 లక్షల పుస్తకాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , మేయర్ పాపాలాల్ , జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఈవో మదన్ మోహన్, కార్పొరేటర్ చావా నారాయణ రావు, ఉపాధ్యాయులు, అధికారులు ఉన్నారు.logo