శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 17:50:11

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

మేడ్చల్ మల్కాజిగిరి : పేద ప్రజలను ఆదుకొని అసరా కల్పించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండల పరిధి ఎదులాబాద్‌, అంకుషాపూర్‌, మర్రిపల్లిగూడ, కొర్రెముల, కాచివాని సింగారం గ్రామాలకు చెందిన బాధితులకు మంత్రి ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహయనిధి వరం లాంటిదన్నారు. ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ పథకం ఎంతగానో సహయపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి, సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్‌లు నరేష్‌, విష్ణు, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి బైనగారి నాగరాజు, యువజన విభాగం అధ్యక్షుడు బాలు యాదవ్‌, నాయకులు పాల్గొన్నారు.