గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 03, 2020 , 12:37:49

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

ఖమ్మం : లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను గురువారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయా లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా నేటి వరకు రూ.4.21 కోట్ల విలువైన చెక్కులు అందజేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.logo