బుధవారం 08 జూలై 2020
Telangana - May 25, 2020 , 22:45:05

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రుల పర్యటన షెడ్యుల్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రుల పర్యటన షెడ్యుల్

మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్‌ మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్లగొల్లపల్లిలో వ్యవసాయ గోదాముకు శంకుస్థాపన చేస్తారు. అదే మండలంలో రాచర్ల బొప్పాపూర్‌లో మార్కెట్‌ కమిటీలో పరిపాలన కార్యాలయ నూతన బిల్డింగ్‌ను ప్రారంభించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడకు చేరుకుంటారు. 

పట్టణంలోని జగిత్యాల బస్టాండ్‌ వద్ద గల మహారాజ ఫంక్షన్‌హాలో రైతు బంధు సమితి సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించే నియంత్రిత సాగుపై అవగాహన సదస్సుకు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నియంత్రిత సాగుపై మంత్రులు దిశానిర్దేశం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వ్యవసాయ క్లస్టర్‌ రైతులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. logo