శనివారం 11 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 13:12:26

రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి వేముల

రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి వేముల

నిజామాబాద్ : జిల్లాలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణం కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో రైతు నాయకుడు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి వేముల సురేందర్ రెడ్డి పేరు మీద నిర్మించే రైతు వేదికకు, అదే విధంగా ముప్కాల్, మోర్తాడ్ మండలం పాలెం గ్రామం, కమ్మర్పల్లి మండలాల్లోని పలు క్లస్టర్లలో నిర్మించే రైతు వేదికల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


logo