శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 19:57:27

ఎమ్మెల్యే బాజిరెడ్డికి మంత్రి వేముల పరామర్శ

ఎమ్మెల్యే బాజిరెడ్డికి మంత్రి వేముల పరామర్శ

నిజామాబాద్ : ఇటీవల కరోనా సోకి రివకరీ అయిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి పరామర్శించారు. అతడి యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు ఇంటి పట్టునే ఉండాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయినా మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు.


logo