శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 21:59:40

భీంగల్ పట్టణంలో మంత్రి వేముల పర్యటన

భీంగల్ పట్టణంలో మంత్రి వేముల పర్యటన

నిజాబామాబాద్ :  పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ పట్టణ కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. ఎనిమిదో వార్డు బాపూజీ నగర్, ఏడవ వార్డు ఆదర్శనగర్, రెండో వార్డు కేజీబీవీ రోడ్డు, నందిగల్లిలోని బ్రహ్మంగారి గుట్ట దగ్గరున్న వైకుంఠధామం, ఎర్రోడు గల్లిలోని భావి, ధోబి గల్లిలోని డ్రైనేజీతోపాటు అంగడి బజార్, ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల తదితర ప్రాంతాల్లో మంత్రి వేముల పర్యటించారు. మహిళలకు టాయిలెట్స్, వైకుంఠధామాలు, అధునాతన మార్కెట్, ఓపెన్ జిమ్, స్కూల్ గ్రౌండ్, పార్కులు తదితర అభివృద్ధి పనుల కోసం స్థలాలను పరిశీలించారు. పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే కొనసాగుతున్న పనులు వేగవంతం చేయాలని, పలు ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేయాలని మున్సిపల్ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్,పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ గంగాధర్,డిసిఓ సింహాచలం, ఆర్డీవో శ్రీనివాస్ పలువురు అధికారులు ఉన్నారు. 
logo