ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 00:49:15

నిరుపేదలకు మంత్రి వేముల అండ

నిరుపేదలకు మంత్రి వేముల అండ

కమ్మర్‌పల్లి: కొవిడ్‌ బాధితులకు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కరోనా పాజిటివ్‌ వచ్చి ఇండ్లలోనే చికిత్స పొందుతున్న పేదలకు నిత్యావసరాలు ఉచితంగా అందజేయాలని టిఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం నుంచి  నాయకులు బియ్యంతోపాటు కూరగాయలు, వంటనూనె, పప్పులు, కోడిగుడ్లను పంపిణీ చేస్తున్నారు.logo