మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:58

జర్నలిస్టు కుటుంబానికి మంత్రి వేముల తోడ్పాటు

జర్నలిస్టు కుటుంబానికి మంత్రి వేముల తోడ్పాటు

  • సకాలంలో స్పందించిన మంత్రి, స్పీకర్‌, మాజీ ఎంపీ కవితకు కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జర్నలిస్టు కుటుంబానికి రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అండగా నిలిచారు. ఒక ప్రధాన పత్రికకు చెందిన నిజామాబాద్‌ బ్యూరో చీఫ్‌, ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడిన విషయం తెలుసుకున్న మంత్రి వేముల.. సోమవారం ఉదయం ప్రత్యేక అంబులెన్స్‌ ఏర్పాటుచేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు వారిని తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తూ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. జర్నలిస్టు, ఆయన కుటుంబసభ్యులు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని మంత్రి అభిలషించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం పట్ల బాధిత జర్నలిస్ట్‌ కుటుంబం, నిజామాబాద్‌ జర్నలిస్టులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.logo