మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 01:17:05

పర్యావరణ రక్షణే భావితరాలకు సంపద

పర్యావరణ రక్షణే భావితరాలకు సంపద
  • మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పర్యావరణ పరిరక్షణే భావితరాలకు మనమిచ్చే సంపద అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం మంత్రి వేముల పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మొక్కలు నాటాలని సూచించారు. దీంతో ఆదివారం అసెంబ్లీ ఆవరణలో మంత్రి వేముల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ హరితహా రం చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్‌కుమార్‌ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌కు మంత్రి వేముల ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు.logo