మంగళవారం 02 జూన్ 2020
Telangana - May 08, 2020 , 01:14:20

భోజనం పెట్టి.. వ్యాన్‌లో సాగనంపి

భోజనం పెట్టి.. వ్యాన్‌లో సాగనంపి

  • వలస కూలీలపై మంత్రి వేముల ఔదార్యం  

బాల్కొండ(ముప్కాల్‌): కాలినడకన సొంత రాష్ర్టాలకు పయనమైన వలస కార్మికులకు శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అండగా నిలిచారు. సొంత ఖర్చులతో వారికి భోజనం పెట్టి.. రాష్ట్ర సరిహద్దు వరకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్‌ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై మంత్రి ఆదేశాల మేరకు గురువారం టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నదానాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాలకు వెళ్తున్న 250 మంది వలస కూలీలకు శ్రీరాంపూర్‌ చిలుకల చిన్నమ్మ ఆలయం వద్ద భోజన వసతి ఏర్పాట్లు చేశారు. 


logo