ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 15:03:54

యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం

యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం

యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మితమవుతున్న పుష్కరిణి, కళ్యాణకట్ట, దీక్షా కాంప్లెక్స్, ప్రెసిడెన్షియల్ సూట్, కొండపై నిర్మిస్తున్న గార్డెన్ పనుల‌ను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధ‌వారం పరిశీలించారు. పనులు జ‌రుగుతున్న‌ తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15 లోపు ప‌నుల‌ను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పారు. ప‌నులు ఇంత నెమ్మ‌దిగా సాగితే ఎప్ప‌టికి పూర్త‌య్యేను అన్నారు. ఇలాగయితే ఎలా.. ఇంకా ఎన్ని రోజులు చేస్తారు. ఇంజినీర్‌ల పనితనం బాగాలేద‌న్నారు. 

ఇప్పటివరకు ఎంత పని ముగిసింది. ఇంకా ఎంత పని మిగిలి ఉందొ చెప్పాల‌న్నారు. విల్లా విల్లాకు ఎంత పని చేయాల్సిన ఉందో వివరాలు రాసి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. రోజువారీగా చేప‌ట్టిన‌ పనుల వివరాలు ఉన్నాయా అని ప్ర‌శ్నించారు. విల్లా విల్లా మధ్యలో ల్యాండ్ స్కేపింగ్ వస్తుందా అని అడిగారు. కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు కూలీల‌ను, ముడిసరుకును అందుబాటులో ఉంచుకోవాల‌న్నారు. ఏ ఏ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో రాసి ఇవ్వాల‌న్నారు. ప‌నులు జ‌రుగుతున్న తీరుపై వైటీడీఏ వసంత నాయక్, ఈఎన్‌సీ రవీందర్ రావు, గణపతి, ఈఈ వెంకటేశ్వర్లు పై మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తి చేశారు. 

VIDEOS

logo