ఆదివారం 31 మే 2020
Telangana - May 10, 2020 , 14:37:09

వలస కార్మికులను పలకరించిన మంత్రి వేముల

వలస కార్మికులను పలకరించిన మంత్రి వేముల

నిజామాబాద్ : సొంతూళ్లకు పయణమైన వలస కార్మికులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చటించారు. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. దారి వెంట మండు టెండలో చిన్న పిల్లలతో నడిచి వెళ్లడాన్ని చూసి చలించిపోయిన ఆయన తన సొంత ఖర్చులతో గత మూడు రోజులుగా భోజనం పెట్టి, రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి మహారాష్ట్ర బార్డర్ వరకు వలస కార్మికులను పంపిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గం శ్రీరాంపూర్ వద్ద ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యం, భోజన సదుపాయాలను మంత్రి పరిశీలించారు.


logo