శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 15:31:37

కరోనాపై పోరాట యోధులకు మంత్రి వేముల అభినందనలు

కరోనాపై పోరాట యోధులకు మంత్రి వేముల అభినందనలు

నిజామాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరాయంగా శ్రమిస్తున్న పలువురి సిబ్బందికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండల కేంద్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి నిరంతరం పనిచేస్తున్న కానిస్టేబుల్‌, ఆశావర్కర్‌, పారిశుద్ధ్య కార్మికులను మంత్రి వారి ఇంటికి స్వయంగా వెళ్లి అభినందించారు. కృతజ్ఞతగా వారికి పండ్లు, బిస్కట్స్‌, వాటర్‌ బాటిల్స్‌ను అందజేశారు. అనంతరం ఇటీవల విదేశాల నుంచి వచ్చి స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాల్సిందిగా కోరారు.
logo