శనివారం 06 జూన్ 2020
Telangana - May 10, 2020 , 14:43:13

క్రీడాకారులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ బత్తాయి పండ్లు పంపిణీ

క్రీడాకారులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ బత్తాయి పండ్లు పంపిణీ

హైదరాబాద్‌ : తెలంగాణ బత్తాయి డే ఫెస్టివల్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నగరంలోని ఎల్బీ స్టేడియం వద్ద పలువురు క్రీడాకారులకు బత్తాయి పండ్లను అందజేశారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ సహకారంతో వాక్‌ ఫర్‌ వాటర్‌ సంస్థ బత్తాయి రైతుల సహాయార్థం నేడు తెలంగాణ బత్తాయి డే ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రోగ నిరోధకశక్తి పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను ప్రతీ ఒక్కరూ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటగాళ్లు వీటిని ఎక్కువగా తీసుకోవాలన్నారు. ప్రతీ రోజూ బత్తాయిలను తీసుకోవడం వల్ల ఇటు వ్యక్తిగత ప్రయోజనంతో పాటు అటు రైతులకు సహాయంగా ఉండొచ్చన్నారు. రాష్ట్ర క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ ఏ. వెంకటేశ్వర్‌ రెడ్డి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo