శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 01:37:43

జీవాలకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వద్దు

జీవాలకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వద్దు

  • అప్రమత్తంగా లేకుంటే కఠిన చర్యలు
  • అధికారులకు మంత్రి తలసాని హెచ్చరిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యాధుల బారినపడిన జీవాలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంవహిస్తే సహించేదిలేదని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టంచేశారు. జిల్లాల పర్యటన సమయంలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్టు తెలిపారు. జీవాల రక్షణకు ప్రభుత్వం రూ.కోట్లు పెట్టి మందులు కొనుగోలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. పశువైద్య దవాఖానల్లో మందులు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఉన్నతాధికారులతో బృందాలను ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టాలని కార్యదర్శిని ఆదేశించారు. logo