సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 18:13:21

పశువీర్యోత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన మంత్రి తలసాని

పశువీర్యోత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన మంత్రి తలసాని

రంగారెడ్డి : జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లిలో గల పశువీర్యోత్పత్తి కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నేడు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పశువీర్యోత్పత్తి కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన కుటుంబాలు మెరుగుపడాలన్నారు. పశు సంపద పెరగాలన్నారు. పశువులకు ఉపయోగించే అత్యాధునిక ల్యాబరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పశువులకు గాలికుంటు వ్యాధులు రాకుండా సరైన సమయంలో నట్టల నివారణ మందులు వేయాలని మంత్రి పేర్కొన్నారు.


logo