సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 13:05:24

వైవిద్యమైన నటనతో ప్రేక్షకులను అలరించారు : మంత్రి తలసాని

వైవిద్యమైన నటనతో ప్రేక్షకులను అలరించారు : మంత్రి తలసాని

హైదరాబాద్‌ : నటుడు జయప్రకాశ్‌రెడ్డి తన వైవిద్యమైన నటనతో ప్రేక్షకులను అలరించారని, తనకు అప్పగించిన పాత్రకు న్యాయం చేసేవారని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల మంత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(74) ఈ తెల్లవారుజామున ఏపీలోని గుంటూరులో గల నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.   


logo