సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 10:53:30

పాడి ప‌రిశ్ర‌మ ప‌ట్ల సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ : మ‌ంత్రి త‌లసాని

పాడి ప‌రిశ్ర‌మ ప‌ట్ల సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ : మ‌ంత్రి త‌లసాని

హైద‌రాబాద్ : పాడి ప‌రిశ్ర‌మ ప‌ట్ల సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ని ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సందర్భంగా పాడి ప‌రిశ్ర‌మ‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలో 2 ల‌క్ష‌ల 13 వేల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల్పించేందుకు పాడి ప‌శువుల పంపిణీ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టామ‌ని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం మండ‌లంలోని రావిరాల‌లో గ్రీన్ ఫీల్డ్ మెగా డైరీని ఏర్పాటు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. 4 స‌హ‌కార డైరీల‌కు పాలు పోసే పాడి రైతుల‌కు ఒక్కొక్క లీట‌ర్ రూ. 4 ప్రోత్సా‌హ‌కాలు ఇస్తున్నామ‌ని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఏ రాష్ర్టం పాడి రైతుల‌కు ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌డం లేద‌న్నారు. ఈ ప్రోత్సాహకాల కోసం రూ. 248 కోట్ల 3 వేలు విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని మంత్రి తెలిపారు. 

విజ‌య డైరీ ఇప్పుడిప్పుడే గాడిలో ప‌డుతుంద‌ని మంత్రి తెలిపారు. 50 శాతం స‌బ్సిడీతో పాడి గేదేలు ఇస్తున్నామ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వాల హయాంలో ప్రోత్సాహ‌కాలు ఉండేవి కావు. రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత సీఎం కేసీఆర్ ఉదార స్వ‌భావంతో ఒక్కో లీట‌ర్‌కు రూ. 4 ప్రోత్సాహ‌కాలు ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. పాడి ప‌రిశ్ర‌మ‌కు సీఎం కేసీఆర్ అడ‌గ‌కుండానే నిధులు ఇస్తున్నారు. కానీ కొవిడ్ ప‌రిస్థితుల వ‌ల్ల కొంత ఆటంకం క‌లిగింద‌న్నారు. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి సీఎం కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. 


logo