శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 16:27:00

జీవాల‌కు వైద్య సేవ‌లందించాలి : మ‌ంత్రి త‌ల‌సాని

జీవాల‌కు వైద్య సేవ‌లందించాలి : మ‌ంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : అన్ని జిల్లాల ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ అధికారుల‌తో జీవాలకు అందుతున్న వైద్య సేవలు, పశుగ్రాసం పెంపకం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ.. సీజ‌న‌ల్ వ్యాధుల బారిన ప‌డిన జీవాల‌కు వైద్య సేవ‌లు అందించ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. జీవాల‌కు అవ‌స‌ర‌మైన మందులు, వ్యాక్సిన్‌ల‌ను ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స‌ర‌ఫ‌రా చేసింద‌ని తెలిపారు. ఆస్ప‌త్రుల్లో మందుల ల‌భ్య‌త‌పై త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. జీవాల వద్దకే వైద్యసేవలు తీసుకెళ్ళాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 100 సంచార పశువైద్యశాలలను ప్రారంభించిన విషయాన్ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గుర్తుచేశారు.


logo