బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 15:50:54

భ‌ట్టి మాట‌లు హాస్యాస్ప‌దం : మ‌ంత్రి త‌ల‌సాని

భ‌ట్టి మాట‌లు హాస్యాస్ప‌దం : మ‌ంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ విష‌యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క మాట‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌లో మంత్రి త‌ల‌సాని మీడియాతో మాట్లాడారు. గాంధీ భ‌వ‌న్ ద‌గ్గ‌ర పేద‌ల ఇండ్ల‌ను కూల్చిన ఘ‌న‌త కాంగ్రెస్ నేత‌ల‌ది అని మంత్రి ధ్వ‌జ‌మెత్తారు. జూబ్లీహిల్స్‌లోని క‌మ‌లాన‌గ‌ర్‌లో డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తుంటే కాంగ్రెస్ నేత‌లు కోర్టులో కేసు వేశారు అని గుర్తు చేశారు. నాంప‌ల్లిలో మేం క‌ట్టింది ఒక‌ద‌గ్గ‌ర‌.. మీరు చూసింది మ‌రో ద‌గ్గ‌ర అని తెలిపారు. జీహెచ్ఎంసీలో ఎక్క‌డ ఇండ్లు క‌డుతున్నామో తెలుసుకుని వెళ్లాల‌ని కాంగ్రెస్ నేత‌లకు సూచించారు. హైద‌రాబాద్‌లో ల‌క్ష ఇండ్లు ఉన్నాయి.. మీకు జాబితా ఇచ్చామ‌ని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల‌పై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేత‌ల‌కు అర్హ‌త లేద‌ని తేల్చిచెప్పారు.  పేద‌వాడికి డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టిస్తున్న రాష్ర్టం దేశంలో మ‌రొక‌టి లేద‌ని స్ప‌ష్టం చేశారు.  క‌రోనా స‌మ‌స్య‌లున్నా ఇళ్ల నిర్మాణం కొన‌సాగుతోంద‌న్నారు. ఈ ఇండ్ల నిర్మాణం ఒక్క రోజులో పూర్తి కాదు అని మంత్రి చెప్పారు.

సీఎం కేసీఆర్ హయాంలో రాష్ర్టం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. మంత్రి కేటీఆర్ నాయ‌క‌త్వంలో హైద‌రాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంద‌న్నారు.  మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ నేత‌లు డ్రామాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. అధికారంలో ఉండ‌గా భ‌ట్టి విక్ర‌మార్క‌ను కాంగ్రెస్ నాయ‌కులు ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు.  కాంగ్రెస్ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో కాంగ్రెస్‌కు అతీగ‌తీ లేదు. జీహెచ్ఎంసీలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి 150 మంది అభ్య‌ర్థులు ఉన్నారా? అని మంత్రి త‌ల‌సాని ప్ర‌శ్నించారు. 


logo