ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 11:40:07

ఈ-కార్ట్‌ వాహనాలు పంపిణీ చేసిన మంత్రి తలసాని

ఈ-కార్ట్‌ వాహనాలు పంపిణీ చేసిన మంత్రి తలసాని

సికింద్రాబాద్‌ : నగరంలోని లాలాపేటలోని విజయ డైయిరీ ప్రధాన కార్యాలయంలో బ్యాటరీతో నడిచే 15 వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విజయ డెయిరీ ఉత్పత్తులకు ప్రజల్లో విశేష ఆదరణ ఉందన్నారు. విజయ డెయిరీ అభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నట్లు తెలిపారు. విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరిన్ని ఔట్‌లెట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రైవేటు డెయిరీలకు ధీటుగా విజయ డైయిరీని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. నగరంలో బ్యాటరీతో నడిచే 100 మొబైల్‌ ఔట్‌లెట్‌ల ద్వారా విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలోనే విజయ డెయిరీని అగ్రస్థానంలో నిలుపుతామని మంత్రి పేర్కొన్నారు.


logo