బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:42:46

సమస్యలపై శాఖలవారీ నివేదిక

సమస్యలపై శాఖలవారీ నివేదిక
  • మంత్రి తలసాని ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలవారీగా పశుసంవర్ధకశాఖలో నెలకొన్న సమస్యలపై  సమ గ్ర నివేదికను రూపొందించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికా రులను ఆదేశించారు. నివేదికను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరుచేయించేందుకు కృషిచేస్తానని చెప్పారు. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనితా రాజేంద్ర మం గళవారం మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని కా ర్యదర్శికి సూచించారు. కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను అభినందించినట్టు తెలిపారు. 


గొర్రె పిల్లల విలువ రూ.3,189 కోట్లు 

2017 జూన్‌లో ప్రారంభించిన ఈ పథకం కింద 76.92 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా.. వా టికి 70.88 లక్షల పిల్లలు జన్మించాయని మంత్రి తెలిపారు. వీటి విలువ సుమారు రూ.3,189 కోట్లు ఉంటుందన్నారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు రైతులకు పాడిగేదెలను పంపిణీచేయడంతోపాటు లీటర్‌ పాలకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నట్టు చెప్పారు. విజయ డెయిరీకి పాల సేకరణను పెంచడంపై ప్రత్యేకంగా దృష్టిసారించడంతోపాటు విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను మరింత పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని, మరిన్ని ఔట్‌లెట్ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 


హైదరాబాద్‌లో 150 మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్లు మత్స్యకారుల సంక్షేమం కోసం ఈ ఏడాది 64 కోట్ల చేపపిల్లలు, 3.5 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను ఉచితంగా విడుదలచేశామ ని, మత్స్యసంపదను విక్రయించుకోవడానికి సబ్సిడీపై వాహనాలు, వలలు అందజేశామని చెప్పా రు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ, సీఈవో మంజువాణి, పశుసంవర్ధకశాఖ అదనపు డైరెక్టర్‌ రాంచందర్‌, విజయ డెయిరీ అధికారులు మల్లయ్య, మల్లిఖార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.


logo