ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. సినిమాల కన్నా ఈ అమ్మడు తన అందచందాలతో అలరిస్తూ వస్తుంది. అదాల నిధులతో హీరోయిన్ వేసే వలలో నెటిజన్స్ ఇట్టే చిక్కుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా చాలా క్రేజ్ పొందిన నిధి అగర్వాల్ తమిళం, తెలుగులో బిజీగా మారిపోయారు. తమిళంలో ఈ అమ్మడికి గుడి కూడా కట్టారంటే నిధి క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ తన గ్లామర్ షోకి సంబంధించిన ఫొటోలను నిత్యం షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బంగారు వర్ణపు చిత్రపటంలా కనిపిస్తున్న నిధి అగర్వాల్ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది. క్లీవేజ్ షోతో కాక రేపుతున్న నిధి అగర్వాల్ మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ అమ్మడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో వస్తోన్న హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. అంతే కాకుండా అశోక్ గల్లా తెరంగేట్రం చేస్తోన్న ‘హీరో’ చిత్రంలోనూ నటిస్తున్నారు.