శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 11:58:08

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి త‌ల‌సాని

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : మ‌ంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ రోజు తన నివాసంలో మంత్రి త‌ల‌సాని మొక్క‌లు నాటారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు ఆకుపచ్చ తెలంగాణ కావాలన్న ఆలోచనతో హరితహారం కార్యక్రమానికి స్పూర్తిగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ‌య‌వంతంగా ముందుకెళ్తుంద‌ని మంత్రి పేర్కొన్నారు.