గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 03:05:44

ప్రగతి చూసి ఓర్వలేకపోతున్నారు

ప్రగతి చూసి ఓర్వలేకపోతున్నారు

  • కాంగ్రెస్‌, బీజేపీ నాయకులపై మంత్రి తలసాని మండిపాటు

షాద్‌నగర్‌:రాష్ట్రప్రగతిని చూసి ఏడవ డం తప్ప ప్రజల సంక్షేమం ఏ మాత్రం పట్టదని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మండిపడ్డారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లి పరిధిలోని పశువీర్యోత్పత్తి కేంద్రం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో కరోనా మూలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదనే విషయాన్ని గ్రహించాలన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం నూతన సచివాలయాన్ని నిర్మిస్తున్నారే తప్ప.. ఎవరి స్వార్థప్రయోజనాల కోసం కాదని తలసాని స్పష్టం చేశారు.  


logo