శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 01:23:05

తెలంగాణ ద్రోహుల పేరు పెడతామా?

తెలంగాణ ద్రోహుల పేరు పెడతామా?

  • ప్రతిపక్షాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపాటు

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రం సాధించి అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సీఎం కేసీఆర్‌ పేరు పెట్టకుంటే.. తెలంగాణ ద్రోహుల పేరు పెడతమా అంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్క్‌ పేరిట దేశంలోనే అతిపెద్ద పార్కు పనులను ప్రారంభించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణాలను అభివృద్ధిచేస్తున్న కేటీఆర్‌ పేరు డబుల్‌ బెడ్రూం ఇళ్ల కాలనీకి పెడితే అక్కడా రాజకీయం చేశారని విమర్శించారు. బుధవారం మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ  కార్యాలయంలో మంత్రి సమక్షంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి పడాకుల శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. 


logo