మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 03:05:43

పేదల సొంతింటి కల సాకారం ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పేదల సొంతింటి కల సాకారం ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ: నిరుపేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నిజంచేసిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లో వీరన్నపేట నిరుపేదలకు డబుల్‌బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లక్కీడిప్‌ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఏండ్లపాటు కిరాయి ఇండ్లల్లో ఉంటూ అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడేవారు సొంతిండ్లలో అడుగుపెట్టనున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లవారీగా లాటరీ ద్వారా ఇండ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. వీరన్నపేటలో నివాసం ఉంటున్న దళితులకు వంద శాతం ఇండ్లు అందిస్తామన్నారు.  


logo