గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 17:46:10

రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ నుంచి జడ్చర్ల వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస గౌడ్‌ శుక్రవారం పరిశీలించారు. నేషనల్‌ హైవేస్‌ అధికారులతో కలిసి మంత్రి రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్‌ నమూనాలను పరిశీలించారు. రోడ్డు నిర్మాణం పూర్తైన తర్వాత డివైడర్‌, గ్రీనరీ, సుందరీకరణ పనులను చేపట్టాలన్నారు. వాటి నమూనాలను తయారు చేయాల్సిందిగా సూచించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నియమ నిబంధనల ప్రకారం పనులు సక్రమంగా జరగాలని మంత్రి ఆదేశించారు.

logo