బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 12:46:14

వంగరను సందర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

వంగరను సందర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

వరంగల్ అర్బన్ : జిల్లా పర్యటనలో భాగంగా ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీవీ స్వగ్రామం వంగరను సందర్శించారు. వంగరలో పీవీ నర్సింహా రావు చిత్ర పటానికి మంత్రి నివాళులు అర్పించారు. పీవీ స్వగ్రామం వంగరను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన పర్యటన సందర్భంగా వంగరలోని పీవీ ఇంటిని సందర్శించారు.

అదే విధంగా పీవీ వాడిన వస్తువుల్ని ఇటీవలే పీవీ తనయుడు ప్రభాకర్ రావు ఢిల్లీ నుంచి తెప్పించారు. మంత్రి ఆ వస్తువులని ఆసాంతం ఆసక్తిగా తిలకించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాష్ట్ర టూరిజం ఎండీ మనోహర్, పీవీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.logo