శనివారం 06 జూన్ 2020
Telangana - May 07, 2020 , 16:12:00

బాధితులకు టీడీఆర్ బాండ్లు అందజేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

బాధితులకు టీడీఆర్ బాండ్లు అందజేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి టీడీఆర్ (ట్రాన్స్ ఫర్ ఆఫ్ డెవలప్ మెంట్ రైట్స్) బాండ్లును మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని నేషనన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో 315 మంది భూయజమానులకు బాండ్స్ పంపిణీ చేశారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పూర్తి చేసి జడ్చర్ల- మహబూబ్ నగర్ మధ్య రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అప్పన్నపల్లి వద్ద త్వరలో మరో ఆర్వోబీ పనులు చేపడతామన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు త్వరగా ముగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 


logo